డైరీ, కేలండర్‌ ఆవిష్కరణ

Jan 23,2024 21:08

ప్రజాశక్తి – పార్వతీపురం: ఎపి ప్రభుత్వ టైపిస్టులు, స్టెనోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ప్రచురించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను డిఆర్‌ఒ జె.వెంకటరావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఎపి రాష్ట్ర ప్రభుత్వ టైపిస్టులు, స్టెనోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ సంఘం పూర్వపు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పి.మణిప్రభాకర్‌, అదనపు కార్యదర్శి ఎ.ధర్మారావు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎపిజెఎసి జిల్లా అధ్యక్షులు, ఎపి రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు జి.శ్రీరామమూర్తి (తహశీల్దారు), ఎపి రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌, కలెక్టరేట్‌ విభాగం అధ్యక్షులు ఆర్‌.ఉమామహేశ్వరరావు (తహశీల్దారు), ఎపి టైపిస్ట్‌, స్టెనోగ్రాఫర్ల సంఘం, శ్రీకాకుళం డివిజన్‌, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్‌ఛార్జి పి.మణిప్రభ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

➡️