తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడి

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్‌క్రాస్‌ తలసేమియా భవనంలో బుధవారం 13 మంది తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడి నిర్వహించినట్లు జిల్లా రెడ్‌ క్రాస్‌ ఛైర్మన్‌ బివి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ తలసేమియా వ్యాధి చిన్నారులకు రక్తమార్పిడి రోజున ప్రతి చర్యలు సంభవించకుండా ఉపయోగించే ఫిల్టర్‌ సెట్స్‌కి దాతల సహకారం కావాలని కోరారు. బుధవారం తలసేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు 35 మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేసిన దంపతులు పివిపిన్‌, తేజస్విల దంపతులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ కార్యదర్శి కెబి.సీతారాం, డాక్టర్‌ ఆర్‌ఎస్‌ఆర్‌కె వరప్రసాదరావు, గౌరవ కార్యదర్శి కడియాల కృష్ణారావు, మానవత సభ్యులు గారపాటి పద్మజావాణి, రత్నాకర్‌ రావు పాల్గొన్నారు.

➡️