తూతూ మంత్రంగా సామాజిక తనిఖీ

ప్రజాశక్తి-లక్కిరెడ్డిపల్లి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో నిర్వహించే సామాజిక తనిఖీ తూతూ మంత్రంగా నిర్వహించారు. స్థానిక మండల పరిషత్‌ ప్రాంగణంలో బుధవారం ఎంపిడిఒ వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన ఏప్రిల్‌ 1, 2022 నుంచి మార్చి 3, 2023 వరకు 11 నెలల కాలానికి ఈ నెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సామాజిక బందాలు గ్రామస్థాయిలో ఉపాధి పనులు తనిఖీ చేసి నివేదిక సిద్ధం చేసి బహిరంగ సమావేశంలో చదివి వినిపించారు. 11 నెలల కాలానికి ఉపాధి వేతనాలు రూ.9.55 కోట్లు , సర్వ శిక్ష అభియాన్‌ ప్రహరీ రూ.2.19లక్షలు, పంచాయ తీరాజ్‌ సచివాలయ భవనాలు రూ.12.32 కోట్ల మెటీరియల్‌ ఖర్చును తనిఖీ చేసి ఓపెన్‌ ఫోరంలో తనిఖీ బందం నివేదికలు చదివి వినిపించారు. సమావేశం ప్రారంభం కాగానే పీడీ మద్దిలేటి సమావేశానికి కూలీలు రాలేదని ఉపాధి సిబ్బందిపై మండిపడ్డారు. మండల వ్యాప్తంగా తనిఖీ బందం వారు రూ.10,87,581లు దుర్వినియోగంగా గుర్తించారు, రూ.70,190 రూపా యలు రికవరీకి ఆదేశించారు. మండలంలోని నలుగురికి క్షేత్ర సహాయ కులు వెయ్యి రూపాయలు చొప్పున రూ.4వేలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మద్దిరేవుల సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ కరువు మండల నేపథ్యంలో జాబ్‌ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 150 రోజులు పని దినాలు కల్పించాలని పీడీని కోరారు. కార్యక్రమంలో రాయచోటి క్లస్టర్‌ ఎపిడి రవికుమార్‌, ఎంపిడిఒ వెంకట్రామన్‌ రెడ్డి, జిల్లా విజిలెన్స్‌ అధికారి ప్రకాష్‌, శివప్రసాద్‌, ఎస్‌అర్‌పి, బాస్కర్‌, ఎపిఒ పెంచలయ్య పాల్గొన్నారు.

➡️