దళితులకు న్యాయం చేయని జగన్‌: టిడిపి

గుంటూరు జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలో దళితులపై దమనకాండ సాగిస్తూ, ప్రజలను మభ్యపెట్టే విధంగా అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత జగన్‌ రెడ్డికి లేదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర (నానీ) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గుంటూరు లాడ్జి సెంటర్‌ లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద రవీంద్ర (నానీ) ఆధ్వర్యంలో దళితులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వ హించారు. తొలుత దళితులపై జరిగిన దాడులను వివరించేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్స్‌, ప్ల కార్డులు చేతబూని ప్రదర్శనగా అంబేద్కర్‌ విగ్రహం వద్దకు చేరుకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో దళితులపై 6వేలకు పైగా దాడులు, 188 మంది దళితులను హత్య చేశారని అన్నారు. దళితులకు రాజ్యాంగ బద్ధంగా అమలు కావాల్సిన 27 సంక్షేమ పథóకాలను రద్దు చేశారని, ఎస్సి ్స కార్పొరేషన్‌ ను రద్దు చేసిన జగన్‌, ఏ మొఖం పెట్టుకొని అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజా రాజధాని అమరావతి నడి బొడ్డున అంబేద్కర్‌ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తే, అక్కడే ఏర్పాటు చేస్తే చంద్రబాబుకు పేరువస్తుందని భావించి, దానిని విజయవాడకు తరలించిన జగన్‌ ప్రజా పాలకుడు ఎలా అవుతారని అన్నారు. అంబెడ్కర్‌ విగ్రహ ఏర్పాటులో అవినీతి జరిగిందని బలంగా ఆరోపణలు విని పిస్తున్నా యని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దీని పై విచారణ జరిపిస్తామని, చివరికి అంబేద్కర్‌ పేరు చెప్పుకొని కూడా వందల కోట్లు దోచుకు తిన్నారని ఆరో పించారు. జగన్‌ దోపిడీ ఆలోచనలు ఎలా ఉంటాయో ప్రజలే వూహించుకోవాలన్నారు. గత ఐదేళ్లుగా జైలులో ఉన్న జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీను విషయంలో జగన్‌ కోర్టుకు వచ్చి తన వాంగ్మూలం ఇస్తే బెయిల్‌ ఇస్తా మని కోర్టు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఐదేళ్లుగా జగన్‌కు తీరిక కూడా లేకపోవటం వెనుక కుట్రకోణం దాగి ఉందని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ జైల్లో నిరాహారదీక్ష చేస్తున్న శ్రీనుకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పరిశీలకులు సింహాద్రి కనకాచారి, ఎస్సి సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు డి.యాకోబు, మైనారిటీ క్రిస్టియన్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు కె.అనిల్‌ కుమార్‌, సుధీర్‌, మన్నయ్య, ధర్మ తేజ, గాడిదపాటి కోటేశ్వరావు,ఇన్నిముక్కల సిద్దార్ధ,ఈరెంటి వర ప్రసాద్‌, కొమ్మినేని కోటేశ్వరావు, సుఖవాసి శ్రీనివాసరావు, రావిపాటి సాయి కష్ణ, నిమ్మల శేషయ్య, కసుకుర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

➡️