దేశం కోసం ప్రాణ త్యాగాలు

Mar 23,2024 20:46

ప్రజాశక్తి- నెల్లిమర్ల : సర్దార్‌ భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌ దేవ్‌లను ఆదర్శంగా తీసుకోని ఉద్యమించాలని వామపక్ష నేతలు కిల్లంపల్లి రామారావు, మొయిద పాపారావు, కాళ్ళ అప్పలసూరి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక అమర కార్మికుల భవనంలో సర్దార్‌ భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌ దేవ్‌ల 93వ వర్ధంతి వేడుకలు సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మోడి నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం దుర్మార్గ పాలనపై వీరి ముగ్గురునీ ఆదర్శంగా తీసుకోని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వామపక్ష నేతలు పాల్గొన్నారు.బొబ్బిలి: దేశం కోసం చిన్నతనంలోనే భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖ్‌ దేవ్‌ ప్రాణ త్యాగం చేశారని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రౌతు రామమూర్తి, రైతు కూలి సంఘం రాష్ట్ర నాయకులు డి.వర్మ అన్నారు. పట్టణంలోని గంటి ప్రసాదం భవనంలో ఎఐవైఎఫ్‌, ఎన్‌జిఒ హోమ్‌లో పిడిఎస్‌ఒ ఆధ్వర్యంలో భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖ్‌ దేవ్‌ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా విప్లవ వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎఇవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి కోట అప్పన్న, పిడిఎస్‌ఒ నాయకులు రాకెష్‌, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.డెంకాడ: మండలంలోని పెదతాడివాడ ప్రాథమిక పాఠశాలలో భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖీదేవ్‌ వర్థంతి శనివారం ఉపాధ్యాయులు జి. నిర్మల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దేశ స్వాతంత్ర కోసం పోరాడి చిరునవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడి వీరమరణం పొందిన గొప్ప యోధులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️