నవోదయ మోడల్‌ గ్రాండ్‌ టెస్ట్‌

Jan 12,2024 21:46

ప్రజాశక్తి – వీరఘట్టం :  స్థానిక శ్రీ గాయత్రీ కళాశాలలో శుక్రవారం యుటిఎఫ్‌ మండల శాఖ ఆధ్వర్యంలో టాప్‌ -30 నవోదయ మోడల్‌ గ్రాండ్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఈ టెస్ట్‌లో పాలకొండకు చెందిన ఎల్‌.అనీష్‌ (ఇంగ్లీష్‌ మీడియం 85) మొదటి స్థానంలో నిలిచాడు. అలాగే ఎల్‌ పార్ధు (తెలుగు మీడియం 83.75) ద్వితీయ స్థానం, వీరఘట్టానికి చెందిన వి.జీవన్‌ (ఇంగ్లీష్‌ మీడియం 80) తృతీయ స్థానం సాధించాడు. గెలుపొందున విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, మండల ప్రధాన కార్యదర్శి కె.గోవిందరావు, కార్యవర్గ సభ్యులు జెవి సూర్యప్రకాష్‌, వాసుదేవరావు, సతీష్‌, చంద్రమోహన్‌, అన్నాజీరావు, రాంబాబు, అప్పలనాయుడు, ఎస్‌.గణేష్‌, ఎల్‌ గణేష్‌, కళాశాల కరెస్పాండెంట్లు ఎస్‌.లోకేష్‌ , వివిధ మండలాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️