నిండుకున్న పంపా రిజర్వాయర్‌

Dec 7,2023 00:26
900 క్యూసెక్కుల నీటిని

ప్రజాశక్తి – అన్నవరం

గత మూడు రోజులుగా భారీ వర్షాలకు అన్నవరం పంపా రిజర్వాయర్‌లోని నీటిమట్టం బ్రహ్మ దగ్గర స్థాయి దగ్గర్లో గురువారం సాయంత్రానికి 103 అడుగులు చేరు కుంది. ఎగువ ప్రాంతంలోని పెద్ద బాపన్న చెరువు, చిన్న బాపన చెరువులోకి అధిక మొత్తంలో వరద నీరు చేరుకుంది. దీనితో అక్కడి నుంచి 1800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో పంపా రిజర్వాయర్‌ నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరడంతో సుమారు 900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఇరిగేషన్‌ డిఇ సురేష్‌ తెలిపారు.

➡️