నిత్యావసరాలు అందజేత

ప్రజాశక్తి- కొమరోలు : మండల పరిధిలోని సర్వేరెడ్డిపల్లె గ్రామానికి చెందిన దగ్గుపాటి సుబ్బయ్య పక్షవాతంతో బాధపడుతున్నారు. అందులో భాగంగా సుబ్బయ్య కుటుంబ సభ్యులకు గిద్దలూరులోని మమ్మీ డాడీ డ్రెస్సెస్‌ దుకాణం యజమాని శ్రీధర్‌ దుస్తులు, నిత్యావసర సరుకులు సోమవారం అందజేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎంఇఒ కావడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దుస్తులు, నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహమ్మద్‌ రఫీ, వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

➡️