నిరాశాజనకమే

కేంద్ర బడ్జెట్‌ నిరాశను మిగిల్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25 ఓట్‌ ఆన్‌ బడ్జెట్‌ను గురువారం సుమారు రూ.47.66 లక్షల కోట్లతో ప్రవేశపెట్టారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలైన ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, గనుల కేటాయింపు ఊసే కనిపించలేదు. రైల్వే బడ్జెట్‌లోనూ కడప-బెంగళూరు రైల్వేలైన్‌ సహా పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుల ప్రస్తావన చేయలేదు. విభజన హామీలను విస్మరించింది. కార్పొరేట్ల ప్రోత్సాహకాలు, పాడి రైతుల ప్రోత్సాహానికి ప్రత్యేక పథకాన్ని ఉటంకించింది. వేతనజీవులను నిరాశ పరిచింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడాన్ని విస్మరించి అధికం చేస్తామని పేర్కంది. గతేడాది వ్యవసాయానికి కేటాయించిన రూ.1.25 లక్ష కోట్లకు రూ. రెండు లక్షలను జత చేసి అత్తెసరు కేటాయింపులకు పరిమితం కావడం విస్మయాన్ని కలిగించింది. ప్రజాశక్తి- కడప ప్రతినిధి/రాయచోటికేంద్ర బడ్జెట్‌లో పెండింగ్‌ ప్రాజెక్టుల ప్రస్తావనే కొరవడింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మల ాసీతారామన్‌ 2024-25 బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టుల కేటాయింపుల జాడే కనిపించలేదు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలైన ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, గనుల కేటాయింపు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పెండింగ్‌ నిధులు, కడప-బెంగళూరు, కడప-విజయవాడ వంటి రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు చేయాల్సి ఉంది. రూ.2.55 లక్షల కోట్లతో రైల్వేబడ్జెట్‌ ప్రస్తావన చేసింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల వివరాలు తెలియడం లేదు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ప్రధానమంత్రి తన హామీనే విస్మరించి అధికం చేస్తామనే ప్రకటనకు పరిమితం కావడం గమనార్హం. వ్యవసాయ అనుబంధ రంగాలైన గ్రామీణాభివృద్ధికి రూ.1.77 లక్షల కోట్లు కేటాయించింది. గతేడాది వ్యవసాయాభివృద్ధికి రూ.1.32,513 లక్షల కేటాయింపులను రూ.1.27 కోట్లకు కుదించింది. ఉమ్మడి జిల్లాలోని సుమారు ఐదు లక్షల మంది రైతుల్లో ఎందరికి ప్రయోజనాలకు కోతపడుతుందో తెలియడం లేదు. వేతన జీవుల ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయకపోవడం నిరాశను కలిగించింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని 32 వేల మంది ఉద్యోగులు, 22,800 మంది పెన్షనర్లకు రిక్తహస్తాన్ని చూపించింది. రైల్వే బడ్జెట్‌ రూ.2.55 కోట్లతో ప్రవేశపెట్టింది. గతేడాది 2.40 లక్షల కోట్ల నుంచి కొంతమేర పెంపుదల కనిపించింది. కానీ ప్రాజెక్టుల వారీగా వివరాలు తెలియడం లేదు. రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లు గడిచిన నేపథ్యంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల విడుదల జాడే కనిపించలేదు. జిల్లాలోని పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులైన కడప-బెంగళూరు, కడప-విజయవాడ, ఓబులవారిపల్లి – కృష్ణపట్నం సివిల్‌ రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులపై అందరి దృష్టీ నిలిచింది. రూ.86 లక్షల కోట్ల ఉపాధి హామీ పనుల కేటాయింపులు చేసింది. దేశవ్యాప్త ంగా 83 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని తొమ్మిది కోట్ల మంది మహి ళలకు మేలు చేస్తామని పేర్కొంది. వీరితోపాటు దేశంలోని అంగన్వాడీలు, ఆశా లను ఆయుష్మాన్‌భారత్‌ పరిధిలోకి తీసుకుని రావడం కొంత ఉపశమనాన్ని కలి గించింది.రాష్ట్రానికి తీరని అన్యాయం కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో కొనసాగించే విషయం గానీ, పోలవరం నిర్వాసితుల విషయం గాని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడప ఉక్కు ఫ్యాక్టరీ, అమరావతి రాజధానికి నిధులు, విభజన హామీల ప్రస్తావన వంటి ఏ అంశాలు ఈ బడ్జెట్లో లేకపోవడంతో మరొకసారి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను వంచించటానికి కేంద్రం సిద్ధమైందని స్పష్టమవు తుందన్నారు. మన రాష్ట్రం నుంచి జిఎస్‌టి వసూళ్ల పెరిగినా రాష్ట్రం వాటా మాత్రం పెరగలేదన్నారు. – పి.శ్రీనివాసులు, సిపిఎం జిల్లా కార్యదర్శి, అన్నమయ్య.ఎన్నికల బడ్జెట్‌ 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ రూపల్పన చేసినట్లు కనిపించింది. సబ్‌కాసాత్‌ సబ్‌కా వికాస్‌ లేదు. మాటలను చేతులకు పొంతన లేదు. మౌలిక వసతుల కేటాయింపులు ఆదానీ, అంబానీలకే. రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. నిరుద్యోగ సమస్య తాండవం చేస్తోంది. ఎపికి ఎటువంటి హామీ నెరవేర్చిన పాపాన లేదు. ద్రవ్యోల్బణాన్ని పెంచి సామా న్యుల జీవితాలను కడగండ్ల పాలు చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. కడప – బెంగళూరు, విజయవాడ రైల్వేప్రాజెక్టు ఊసేలేదు. స్టీల్‌ప్లాంట్‌, పోలవరానికి దిక్కు లేదు.- జి.ఈశ్వరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు. మోసకారి బడ్జెట్‌ కేంద్ర బడ్జెట్‌ మేడిపండు చందం. రైతులు, యువత, మహిళలు, పేదల స్తంభాల మీద బడ్జెట్‌ పెట్టినట్లు చెప్పింది. లోతులను పరిశీలిస్తే లోన లొటారం పైన పటారమే. రైతులు ఆశించిన పిఎం కిసాన్‌ రూపాయి పెంచలేదు. వ్యవ సాయ రుణాలు రద్దు చేస్తారని నిరాశ కలిగించింది. మహిళలకు గ్యాస్‌, నిరుపేదలకు డిబిటి చేస్తార ఆశల్ని అడియాశలు చేసింది. 14 లక్షల కేంద్ర ఉద్యోగాల భర్తీ చేస్తారని ఆశించిన యువతను నిరాశ పరిచింది. ఎపికి టోపీ పెట్టింది. ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంద్ర బుందేల్‌ ఖండ్‌ తరహా ప్యాకేజీ, కడప స్టీల్‌, దుగ్గరాజపట్నం ఓడరేవు, విశాఖ మెట్రో, రైల్వేజోన్‌ వంటి హామీలను విస్మరించింది. – ఎన్‌.తులసిరెడ్డి, పిసిసి మీడియా చైర్మన్‌.

➡️