నిర్మానుష్యం

Dec 5,2023 21:07

 ప్రజాశక్తి-విజయనగరం కోట  :  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల విజయనగరం మీదుగా వెళ్తున్న పలు రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి రైల్వేస్టేషన్లు బోసిపోయాయి. మిచౌంగ్‌ తుపాను ప్రభావం ఉత్తర కోస్తా జిల్లాలపై కూడా ఉండడంతో విజయనగరం రైల్వే స్టేషన్‌ మీదుగా నడిచే రైళ్లను రద్దు చేశారు. వీటిలో 15228 ముజాఫర్‌ పూర్‌ – బెంగళూరు, 12516 గౌహతి – బెంగళూరు, 22504 డిబూకర్‌ – కన్యాకుమారి, 12839 షాలిమార్‌ – చెన్నై సెంట్రల్‌ మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌, 12863 హౌరా – బెంగళూరు యశ్వంతపూర్‌, 13357 రాంచి – కేరళ, 17244 రాయగడ – గుంటూరు పాసింజర్‌, 12840 చెన్నై – షాలిమార్‌ , 22856 తిరుపతి – ఛత్రగచ్చి, 17243 గుంటూరు – రాయగడ , 18511 కోరాఫుట్‌ – విశాఖపట్నం, 12846 బెంగళూరు – భువనేశ్వర్‌ స్పెషల్‌ ట్రైన్‌లు ఉన్నాయి. ముందుగానే తుపాను హెచ్చరికలు రావడంతో ప్రయాణికులంతా తమ ప్రయాణికులను రద్దు చేసుకున్నారు.ఈ నేపథ్యంలో విజయనగరం రైల్వేస్టేషన్‌ ప్రయాణికులు లేక బోసిపోయింది. నిర్మానుష్యంగా ఆర్‌టిసి కాంప్లెక్సువిజయనగరం కోట : తుపాను నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో ప్రయాణాలను, మార్కెట్‌లో పనులను వాయిదా వేసుకున్నారు. ఈనేపథ్యంలో ఆర్‌టిసి కాంప్లెక్సు, నగరంలోని రహదారులు మంగళవారం బోసిపోయాయి. మంగళవారం కావడంతో మార్కెట్‌ సెలవు కూడా ప్రజలకు తుపాను నుంచి కొంతమేర ఉపశమనం లభించినట్లు అయింది.

➡️