నిర్మించబోయేది భవనం కాదు ఉద్యమ శిక్షణా కేంద్రం

పల్నాడు జిల్లా: నిర్మించ తలపెట్టిన యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా భవనం ఇసుక,ఇటుక, సిమెంట్‌ భవనం అని భావించకుండా ఉద్యమ శిక్షణ కేంద్రంగా భావించాలని, త్వరితగతిన ఈ నిర్మాణం చేపట్టి రాష్ర ్టస్థాయిలో యుటిఎఫ్‌ సమావేశం ఏర్పాటు చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్సీ కె.ఎస్‌ లక్ష్మణరావు అన్నారు. స్థానిక పల్నాడు రోడ్‌ లోని ఎస్‌ ఎస్‌ ఎన్‌ కళాశాల ఆడిటోరియంలో శనివారం యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా భవన నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. సమావేశానికి యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి .ప్రేమ్‌ కుమార్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సమ స్యల పరి ష్కారం కోసం పాటుపడుతున్న యుటిఎఫ్‌ తమ కార్యచరణ రూపొందించుకునేందుకు ఉద్యమ బలాన్ని అందించే శిక్షణ కేంద్రా లుగా భావించాలన్నారు. యూటీఎఫ్‌ కు సంబంధించి ఏ కార్యక్రమం రూపొందిం చినా రూ 25 వేలు విరాళం ఇవ్వడం జరుగుతుందని, పల్నాడు జిల్లా పై ఉన్న ప్రత్యేక అభిమానంతో యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయ నిర్మాణానికి రూ 1 లక్ష విరాళం అందజేయనున్నట్లు ఎమ్మెల్సీ ప్రక టించారు. పల్నాడు ప్రాంతంలో సౌక ర్యాల లేమితో ఉపాధ్యాయులు పనిచేసేం దుకు విముఖత చూపుతున్నా రని ఆయా ప్రాంతాలలో పనిచేసేందుకు యు టి ఎఫ్‌ ఉపాధ్యాయులు ముందుకు రావాల్సిన అవ సరం ఉందన్నారు. వెనుకబడిన పల్నా డులో అక్షరాస్యత శాతం పెంపొందించేం దుకు కృషి చేయాలన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు నక్క వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ మాట్లా డుతూ ప్రతి ఏడాది జాబు క్యాలెండర్‌ విడుదల చేస్తానని హామీ ఇచ్చి ఒక జాబ్‌ క్యాలెండర్‌ కూడా విడుదల చేయలేదని సిఎం జగన్‌ని విమర్శించారు. రాష్ట్రంలో 25 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే నాడు-నేడు పేరుతో పాఠశాల భవనాలను ఆధునికరించిన ప్రభుత్వం ఉపాధ్యాయులు లేకుండా విద్య రంగం ఎలా బలోపేతం అవుతుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అప్రెంటీస్‌ వ్యవస్థ రద్దు కోసం అవ సరమైతే ఉపాధ్యాయ సంఘాలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తా మని హెచ్చరించారు. యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌ మాట్లా డుతూ కేవలం ఉపాధ్యాయుల సమస్యల కోసం నాణ్య మైన విద్యా వ్యవస్థ కోసం యుటిఎఫ్‌ పోరాటాలు చేయడం లక్ష్యం కాదన్నారు. సమాజంలో నెలకొన్న అస మానతలు సమస్యలు పరిష్కారానికి ఉపాధ్యాయులు తమ వంతు పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఉంద న్నారు. ఇటీవల అంగన్వాడీలు ఆశా వర్కర్లు సమ గ్ర శిక్ష ఉద్యోగులు ఇతర స్కీం వర్కర్లు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం చేస్తున్న పోరాటాలకు మద్దతు తెల పడంతో పాటు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని గుర్తు చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేసే ఏ పోరా టానికైనా యుటిఎఫ్‌ మద్దతు తప్పనిసరిగా ఉంటుందని వివరించారు. ఇటీవల పదవి విరమణ పొం దిన యుటిఎఫ్‌ ఉపా ధ్యాయులను యుటి ఎఫ్‌ పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సత్క రించారు. అనంతరం భవన నిర్మాణానికి ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా తమ వంతు విరాళాలను ప్రకటించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయసారథి, జిల్లా సహాధ్య క్షులు ఎం.మోహనరావు, జిల్లా సహాధ్యక్షు రాలు ఏ. బాగేశ్వరి దేవి, జిల్లా కోశాధికారి, జె. వాల్యానాయక్‌, యుటిఎఫ్‌ నాయకులు ఎం సుందర్రావు వై.శ్రీనివాస రావు మల్లికా బేగం పాల్గొన్నారు.

➡️