నీతివంతమైన పాలన అందించాం

Mar 23,2024 21:10

ప్రజాశకి-విజయనగరం టౌన్‌ : నీతివంతమైన పాలన అందించిన వైసిపికి మరోసారి అవకాశం ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్‌, విజయనగరం వైసిపి అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. శనివారం దాసన్నపేట నవాబు పేట ప్రాంతం నుంచి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్న తమకు వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణాన్ని చేపట్టి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేసినట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని చూసి ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు.మరొకసారి అవకాశం ఇచ్చినట్లయితే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల అభివద్ధి మండలి డైరెక్టర్‌ బంగారు నాయుడు, జోనల్‌ ఇన్‌చార్జిలు బొద్దాన అప్పారావు, బోడ సింగి ఈశ్వరరావు, కార్పొరేటర్లు పొంతపల్లి మాలతి, గాదం మురళి, ఆల్తి సత్యకుమారి, మాజీ కౌన్సిలర్‌ కోరాడ సూర్య ప్రభావతి, వైసిపి నాయకులు కేఏపీ రాజు, కోరాడ రాజు, పొంతపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.

➡️