నీతి నిజాయతీలకు నిలువుటద్దం చెంచయ్య

ప్రజాశక్తి-సంతనూతలపాడు: కామ్రేడ్‌ తవనం చెంచయ్య నీతి నిజాయతీలకు నిలువుటద్దం అని సిపిఎం సీనియర్‌ నాయకులు కోదాటి కోటేశ్వరరావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే తవనం చెంచయ్య 11వ వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక సుందరయ్య భవనంలో చెంచయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోదాటి కోటేశ్వరరావు మాట్లాడుతూ తవనం చెంచయ్య తన జీవితాంతం పేదల పక్షాన నిలిచి వారి అభివృద్ధికి ఎనలేని కృషి చేశాడని అన్నారు. రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి నిరాడంబరంగా జీవించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నెరుసుల వెంకటేశ్వర్లు, ముద్రగడ సుబ్రహ్మణ్యం, తేళ్ల ప్రభుదాసు, గుంజి ఆంజనేయులు పాల్గొన్నారు.

➡️