నూతన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌

వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కార్డులకు రూ.25 లక్షల వరకు వైద్య సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో నూతన ఆరోగ్యశ్రీ కార్డులను ఎంఎల్‌ఎ మేక వెంకట ప్రతాప్‌ అప్పారావు పట్టణంలోని మూడు, నాలుగు వార్డుల లబ్ధిదారులకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి సిఎం జగన్‌ పాటు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

➡️