నైపుణ్యం మెరుగుదలకు సదస్సు తోడ్పాటు జె

Feb 15,2024 20:53

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు అవగాహనసదస్సు తోడ్పడుతుందని జెఎన్‌టియు జివి వైస్‌ఛాన్సలర్‌ వెంకటసుబ్బయ్య తెలిపారు. యూనివర్శిటీలో గురువారం వన్డే ఓరియంటేషన్‌ ప్రోగ్రాం ఆన్‌ బిసిడిఇ యాక్టివిటీస్‌ అండ్‌ బెనిఫిట్స్‌ అనే కార్యక్రమం రాష్ట్రప్రభుత్వం,జెఎన్‌టియుజివి ఆధ్వర్యాన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్‌ వెంకటసుబ్బయ్య పాల్గొని మాట్లాడుతూ సాంకేతిక రంగం పట్ల యువత పట్టు సాధించాలన్నారు. అతిథిగా విచ్చేసిన బిసిడిఇ సిఇఒ ప్రొఫెసర్‌ దేవకుమార్‌ మాట్లాడుతూ బి సి డి ఇ ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జయసుమ , బిసిడిఇ యూనివర్సిటీ కోఆర్డినేటర్‌ జిజె నాగరాజు, యూనివర్సిటీ కాలేజ్‌ కోఆర్డినేటర్‌, అనుబంధ కళాశాలల బి సి డి ఇ కోఆర్డినేటర్లు, అంబాసిడర్లు, సోల్జర్లు పాల్గొన్నారు.

➡️