న్యాయవాదులు రిలే దీక్షలు

Jan 10,2024 16:40 #Kakinada, #Lawyers protest

ప్రజాశక్తి-ఏలేశ్వరం(కాకినాడ) : ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు కోరుతూ ప్రత్తిపాడు కోర్ట్‌ ఆవరణలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు చిట్టంశెట్టి పుల్లయ్య మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి ప్రజలతో పాటు చిన్న సన్నకారు రైతులకు కూడా ఇబ్బందికరంగా మారే ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌- 2022 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో భార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బొంగుళూరి మధుబాబు, మాజీ అధ్యక్షుడు బుగతా శివ, న్యాయవాదులు ఆడారి సుగుణ, ఆకుల హరిబాబు, ఆర్‌ వెంకట్రావు, కే సూర్య ప్రకాష్‌, రాయి శ్రీను, రాజేష్‌, అవసరాల దేవి, మల్లేశ్వరరావు, వెంకట్‌ రెడ్డి, వెంకటేష్‌, మంజూష ఉన్నారు.

➡️