న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రజాశక్తి – చాపాడు అందుబాటులో ఉన్న న్యాయ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మైదుకూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఖాజా మైనుద్దీన్‌ పేర్కొన్నారు. మండల న్యాయ సేవ సమితి ఆధ్వర్యంలో గురు వారం విజయనగరంను మోడల్‌ గ్రామంగా ఎంపిక చేసి న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అన్యాయం జరిగినప్పుడు న్యాయం పొందాలన్నారు. పుట్టబోయే బిడ్డ నుంచి మతి చెందే వరకు ప్రతి ఒక్కరికి చట్టాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. చట్టానికి అందరూ సమా నమని ప్రతి ఒక్కరూ తెలుసుకుని అందుకు అనుగుణంగా నడవాలన్నారు. న్యాయవాదులు అందుబాటులో ఉన్న చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం చిన్నగురువలూరు హస్టల్‌ను సందర్శించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కొండారెడ్డి డిటి యామిని, ఆర్‌ఐ ప్రమీల, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ పి నారాయణ రెడ్డి, పిపి వి.జేయన్‌ శర్మ, ఎక్స్‌ బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాసులు, సీనియర్‌ న్యాయవాదులు జేకే చారి, సిసి పుల్లయ్య, ఏవి రమణ, కరిముల్లా, ప్యానల్‌ అడ్వకేట్‌ ఎం శ్రీనివాసులు ,జూనియర్‌ అడ్వకేట్‌ ఖాదర్‌, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

➡️