పండగ పూట పంగనామాలేనా..?

Jan 9,2024 21:54

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌, వాటర్‌ సెక్షన్‌ కార్మికుల 15వ రోజు సమ్మెలో భాగంగా సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ ఆధ్వర్యంలో మంగళ వారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద గల సమ్మె శిబిరం వద్ద వినూత్నంగా పంగనామాలు పెట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు నాగవంశం శంకర్రావు, చీపురుపల్లి సింహాచలం, పడాల గాంధీ, మామిడి శివ, బంగారు రాజేషు, గుంట్రెడ్డి గంగయ్యలు, తాడ్డి వినరు, వంగపండు అప్పలనాయుడు, మేడిశెట్టి కృష్ణ, అరసాడ తాతబాబు, క్రాంతి, రమేష్‌, శ్రీను, నాగవంశం మల్లేసు, బంగారు రవి, నిర్మల ఇప్పలమ్మ, పాపులమ్మ పడాల సంతు, వెంకన్న, సాయి, రవి, సత్తిరాజు, పలువురు కార్మికులు పాల్గొన్నారు.సాలూరు: మున్సిపల్‌ కార్మికుల సమ్మె 15రోజుకు చేరింది. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన కార్మికులు నుదుట పంగనామాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు టి.రాముడు, కార్యదర్శి టి.శంకరరావు మాట్లాడుతూ పట్టణాల్లో అపారిశుధ్యం తాండవిస్తోందని, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదని అన్నారు. సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని చెప్పారు.వెంటనే డిమాండ్లను ఆమోదించాలని డిమాండ్లను ఆమోదించాలని కోరారు. కార్యక్రమంలో పోలరాజు, శ్రీను, సంతోష్‌ పాల్గొన్నారు.

➡️