పంప్‌ హౌస్‌ కార్మికులకు జీవో 7 ప్రకారం వేతనాలివ్వాలి

Jan 5,2024 20:03

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  రామతీర్థాలు, ముషిడిపల్లి, నెల్లిమర్ల మాస్టర్‌ పంప్‌ హౌస్‌ కార్మికులను మెన్‌, మెటీరియల్‌ నుంచి వేరుచేసి జీవో నెంబర్‌ 7 ప్రకారం రూ.18వేలు జీతం చెల్లించేలా కౌన్సిల్‌లో తీర్మానం చేయించాలని కోరుతూ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామికి, మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మికి, కమిషనర్‌కి, వైసిపి ఫ్లోర్‌ లీడర్‌ ఎస్‌ వివిరాజేష్‌, కార్పొరేటర్‌ నారాయణరావుకు శుక్రవారం కార్మికులు సిఐటియు ఆధ్వర్యాన వినతులు ఇచ్చారు. కోలగట్ల వీరభద్ర స్వామి స్పందిస్తూ కౌన్సిల్‌లో తీర్మానం చేయిస్తామని హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.జగన్మోహన్‌రావు, నాయకులు మురళి, అరుణ్‌, గౌరీ, నారాయణరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️