‘పది’ విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ

ప్రజాశక్తి-కొనకనమిట్ల: యుటిఎఫ్‌ కొనకనమిట్ల మండల శాఖ ఆధ్వర్యంలో మండలశాఖ అధ్యక్షులు కె నాసర్‌ మొహమ్మద్‌ అధ్యక్షతన మండలంలోని జడ్‌పిహెచ్‌ఎస్‌ కెకె మిట్ల, జడ్‌పిహెచ్‌ఎస్‌ రేగడపల్లి, జడ్‌పిహెచ్‌ఎస్‌ మర్రిపాలెం, అంబేద్కర్‌ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ వెలుగొండ, జడ్పీహెచ్‌ఎస్‌ గొట్లగట్టు, జడ్పీహెచ్‌ఎస్‌ చిన్నారికట్ల, జెడ్పిహెచ్‌ఎస్‌ పెదారికట్ల అన్ని స్కూళ్లకు కలిపి మొత్తం 470 మంది పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సుమారు రూ.35 వేలు విలువచేసే స్టడీ మెటీరియల్‌ (యుటిఎఫ్‌ టెస్ట్‌ పేపర్స్‌) దాతల ద్వారా ఉచితంగా సోమవారం అందజేశారు. అందుకు సహకరించిన స్పందన ఫౌండేషన్‌, ఎస్‌కె నఫీఉన్నీసాబేగం, పి విజయలక్ష్మి, దొడ్డ సుబ్బారెడ్డి, మర్రిపాలెం, ఎం తిరుమలరావు, మధుసూదనాచారి, బి భాగ్యలక్ష్మి, కిలారి వెలుగొండయ్య, యుద్ధం శ్రీను, ఎం నారాయణ, జి అపరంజికుమారి, ఎన్‌ ఆంజనేయులు, దాతలకు, సహకరించిన యుటిఎఫ్‌ నాయకులకు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. పై కార్యక్రమంలో మండల విద్యా శాఖ అధికారి-2 బరిగే నర్సింహారావు, యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు షేక్‌ అబ్దుల్‌హై, మండల అధ్యక్షుడు నాసర్‌ మొహమ్మద్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌.కామేశ్వరరావు, పి.శ్రీనివాసులురెడ్డి, కాసు తిరుపతిరెడ్డి, ఎస్‌ సంజీవరావు, బరిగే మస్తాన్‌, మరియు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, డి సుజాత, ఎస్‌ రామాంజనేయులు, సూరే నాగేశ్వరరావు, ఎస్‌ వెంకటేశ్వర్లు, ఇంచార్జ్‌ ప్రిన్సిపాల్‌, విజయలక్ష్మి, బి కోటిరెడ్డి, సాతర్ల నరసింహారావు, ఆయా పాఠశాలలోని ఉపాధ్యాయులు ఆంజనేయచౌదరి, యుద్ధం శీను, మునగ జయకృష్ణ, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, రాజవర్ధన్‌, కాకునూరి వెంకటేశ్వర్లు, మహమ్మద్‌ అలీ, కె ఆదాం, భాస్కర్‌రెడ్డి, శార్వారికుమారి, టీవీ రమణయ్య, సీతారామయ్య, కె నరసింహారావు, బుర్రి శ్రీనివాసులు, అన్నెబోయిన శ్రీనివాసులు పాల్గొన్నారు. యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు షేక్‌ అబ్దుల్‌హై మాట్లాడుతూ గత సంవత్సరం ఈ స్టడీ మెటీరియల్‌ ద్వారా 10వ తరగతి పరీక్షల్లో 80 శాతం ప్రశ్నలు వచ్చాయని, ఈ స్టడీ మెటీరియల్‌ ఉపయోగించుకొని విద్యార్థులు అత్యధిక మార్కులు పొందవచ్చని, బాగా వెనుకబడిన విద్యార్థులకు ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుందని, అందరూ బాగా చదువుకొని మొదటి శ్రేణిలో పాస్‌ కావాలని ఆకాంక్షించారు. పాఠశాలకు మండలానికి తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని అన్నారు. అనంతరం దాతలను శాలువాతో సన్మానించారు. హనుమంతునిపాడు: హనుమంతునిపాడులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు యుటిఎఫ్‌ తయారు చేసిన టెస్ట్‌ పేపర్స్‌ మెటీరియల్‌ హనుమంతునిపాడు జడ్పిటిసి దద్దాల నారాయణ ఆర్థిక సహకారంతో విద్యార్థులందరికీ బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు దద్దాల శ్రీనివాసులు ద్వారా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మెటీరియల్‌ని అందించిన దద్దాల నారాయణకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవి సురేష్‌, బొప్పరాజు సుబ్బారావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.

➡️