పనికితగ్గ వేతనం ఇవ్వాలి

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ మున్సిపల్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.చెన్నయ్య, సి.రాం బాబు అన్నారు. మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 9వ రోజుకు చేరుకుంది. చేతులకు తాళ్లు కట్టి మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాలుగా మున్సిపల్‌ ఉద్యోగ, కార్మికులు తమ సమస్యల పరిష్కారం చేయాలని ప్రభుత్వ పెద్దలకు అభ్యర్థిం చన ఫలితం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయాల న్నారు. కార్మిక శాఖ ప్రతిపాదనల మేరకు జిఒ ఆర్‌టి నెంబర్‌ 30 ప్రకారం పంపు ఆపరేటర్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ వర్కర్స్‌, వర్క్‌ ఇన్స్పెక్టర్లు, కంప్యూ టర్‌ ఆపరేటర్లు, బిల్‌ కలెక్టర్లు, స్ట్రీట్‌ లైటింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌, ఆఫీసు నిర్వహణ కార్మికులకు వేతనాలు పెంచుతామని మూడేళ్లుగా హామీలతోనే సరిపెడు తున్నారని విమర్శించారు. మున్సిపల్‌ కార్మికులు 10-15 ఏళ్లుగా నైపుణ్యంతో కూడిన పనులు నిర్వహిస్తున్న ఇంజినీరింగ్‌ కార్మికులకు టెక్నికల్‌ వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం దాగా చేస్తోందని విమర్శించారు. మున్సిపల్‌ కార్మికులకు ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలుకి నోచుకోవడం లేదని తెలిపారు. పట్టణాల విస్తీర్ణం, జనాభా పెరుగుదల దష్ట్యా కార్మికులను పెంచడం లేదన్నారు. విశ్వ విపత్తు కరోనా సందర్భంగా తీసుకున్న అదనపు సిబ్బందికి ఉద్యోగ భద్రత లేదని చెప్పారు. సిపిఎస్‌ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేస్తామన్న హామీని విస్మరించారని పేర్కొన్నారు. ఈ సమ్మెతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలిగి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శి నరసింహ సంఘీభావం తెలియజేశారు. కార్యక్ర మంలో సిద్దయ్య, పెద్ద మంగమ్మ, తిరుపతమ్మ, అంజనేయులు, రవికుమార్‌, వై.వెంకటరమణ, రమణమ్మ పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : పారిశుధ్య కార్మికులు పురపాలక కార్యాలయం ఎదుట దీక్షాశిబిరంలో పొర్లు దండాలు పెట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ ఓబయ్య, నాయకులు లక్ష్మీదేవి, ప్రసాద్‌, రమణ, రెడ్డయ్య, రమేష్‌ పాల్గొన్నారు.

➡️