పలువురు తహశీల్దార్లు బాధ్యతలు స్వీకరణ

Feb 5,2024 21:08

ప్రజాశక్తి – కురుపాం : స్థానిక తహశీల్దార్‌గా ఎ.వేణుగోపాల్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన అరకు వ్యాలీ మండలంలో పనిచేస్తూ ఎన్నికలు నేపథ్యంలో బదిలీపై కురుపాం వచ్చారు. గతంలో కురుపాం తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్‌.రమేష్‌కుమార్‌ బదిలీపై కొమరాడ మండలానికి వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తహశీల్దార్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ మండలంలోని అందరి అధికారులను, ప్రజాప్రతినిధులను కలుపుకుంటూ తన విధులు, బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని, అందరూ సహకరించాలని కోరారు.పాలకొండ : తహశీల్దారుగా వరహాలు సోమవారం బాధ్యతలు చేపట్టారు. విశాఖపట్నం జిల్లాలో పని చేస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ పని చేసిన తహశీల్దారు సోమేశ్వర్రావు అల్లూరి సీతారామరాజు జిల్లా అరుకు మండలానికి బదిలీ అయ్యారు.సీతానగరం : స్థానిక తహశీల్దార్‌గా జివి జనార్ధన్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి పనిచేస్తున్న ఎంవి రమణకు విశాఖపట్నం బదిలీ అయ్యింది. ఈ సందర్భంగా ఆయనకు విఆర్వోలు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ శ్రీనివాసరావు, డిటి, విఆర్‌ఒలు, సిబ్బంది పాల్గొన్నారు గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం తహశీల్దార్‌గా శివ శంకర సత్యనారాయణ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన శ్రీకాకుళం జిల్లా సోంపేట నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మరోవైపు గుమ్మలక్ష్మీపురం ఇన్చార్జి ఎంపిడిఒగా జగదీష్‌ కుమార్‌ను ఉన్నతాధికారులు నియమించారు. ఈయన ప్రస్తుతం ఇఒపిఆర్‌డిగా పనిచేస్తూ ఎఫ్‌ఎసిపై ఎంపిడిఒ బాధ్యతలు చేపట్టారు. పాచిపెంట: పాచిపెంట తహశీల్దార్‌గా పి. బాల సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్‌ ఆఫీసులో ఏవోగా విధులు నిర్వహిస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు డిప్యూటీ తహశీల్దార్‌ ఎం. రాజశేఖర్‌, ఆర్‌ఐ రమణారావు, సిబ్బంది స్వాగతం పలికారు.పార్వతీపురం రూరల్‌: పార్వతీపురం తహశీల్దారుగా ఆనందరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం జివిఎంసిలో బాధ్యతలు నిర్వహించిన ఈయన ఇటీవల జరిగిన బదిలీలలో పార్వతీపురానికి తహశీల్దార్‌గా వచ్చారు. ఈయనకు స్థానిక డిటి వెంకటరమణ, ఆర్‌ఐ రామకృష్ణలు స్వాగతం పలికి అభినందించారు. గరుగుబిల్లి : మండల తహశీల్దార్‌గా కె జయ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తహశీల్దారుగా విధులు నిర్వహించిన గేదెల వెంకట జనార్ధన్‌ సీతానగరం మండల తహశీల్దారుగా బదిలీపై వెళ్లారు. ఈనేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలోని గోపాలపట్నం తహశీల్దారుగా పనిచేస్తున్న కె జయను మండల తహశీల్దారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన నూతన తహశీల్దార్‌కు డిటి పెళ్లూరి సత్యలక్ష్మి కుమార్‌, మండంగి కృష్ణ, సిబ్బంది రమేష్‌, గులిపల్లి తేజేశ్వరరావు, తుమరాడ నాగరాజు, బసవ సాయిపవన్‌లు అబినందనలు తెలిపారు.

➡️