పాఠశాల భవనం నుండి దూకి విద్యార్థిని మృతి

Feb 28,2024 23:59

మృతురాలు రిషిత (ఫైల్‌)
ప్రజాశక్తి-పిడుగురాళ్ల :
పాఠశాల భవనం 4వ అంతస్తు నుండి దూకి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. పట్టణంలోని రైల్వే స్టేషన్‌ ప్రాంతానికి చెందిన కొనకొండ్ల రిషిత రిషిత (16) తొమ్మిదో తరగతి నుండి పట్టణంలోని భాష్యం పాఠశాలలో చదువుతున్నారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న రిషిత బుధవారం ఉదయం పాఠశాలలో సైన్స్‌డే జరగుతున్న సమయంలో భవనం 4వ అంతస్తుకు వెళ్లిన రిషిత అక్కడి నుండి కిందకు దూకింది. వెంటనే ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి స్థాని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రిషిత మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. కొద్దినెలలుగా మానసిక సమస్యతో బాధపడున్న రిషిత గతేడాది డిసెంబర్‌ నుండి పాఠశాలకు రావడం లేదని, పరీక్షల నేపథ్యంలో నాలుగు రోజుల కిందడి నుండే వస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం చెబుతోంది. ఈ మేరకు తల్లిదండ్రుల నుండి రాతపూర్వకంగా లేఖనూ తీసున్నట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని మృతురాలి మేనమామ కూడా ధ్రువీకరించారు. అమ్మాయికి మానసిక సమస్య కారణంగా రెండు నెలల నుండి హైదరాబాద్‌లోని ఓ మానసిక వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నామని, పరీక్షలు రాయించేందుకు పాఠశాలకు పంపామని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఫిర్యాదేమీ రాలేదని, కేసు నమోదు చేయలేదని సిఐ వీరాంజనేయులు తెలిపారు.సమగ్ర విచారణ చేయించాలి : ఎస్‌ఎఫ్‌ఐఇదిలా ఉండగా విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.సాయికుమార్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాఠశాలలో సరైన రక్షణ చర్యలు లేని కారణంగా ఈ ఘఠన తలెత్తిందని, ఇది పాఠశాల యాజమాన్యం వైఫల్యమేనని పేర్కొన్నారు.

➡️