పారా మిలటరీ, పోలీసు బలగాల కవాతు

ప్రజాశక్తి-చీరాల: సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో జిల్లా ఎస్‌పి వకూల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ రెండో పట్టణ సిఐ సోమశేఖర్‌ అన్నారు. శుక్రవారం డిఎస్‌పి పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బలగాలతో పట్టణంలోని పలు ప్రాంతాలలో పోలీసులు పారా మిలిటరీ బాలగాలు కవాతు నిర్వహించాయి. పట్టణంలోని శ్రుంగారిపేట, ఆనందపేట, జక్కవారి స్ట్రీట్‌, ఇఎల్‌ టిడి, మసీద్‌ సెంటర్‌, పేరాలలో ఎన్నికల దృష్ట్యా కవాతు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు జరగబోయే ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించేవారిపై, ఎన్నికలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని, ఎటువంటి సంఘటనలు తలెత్తిన మేమున్నాం అంటూ భరోసా ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు మురళి, వెంకటేశ్వర్లు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. కంభం రూరల్‌: ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం కంభం పట్టణంలో ఎన్నికల దృష్ట్యా డిఎస్‌పి, సీఐ, ఎస్‌ఐల ఆధ్వర్యంలో పోలీస్‌ కవాతు నిర్వహించారు. ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలో ఎన్నికల సందర్భంగా ట్రైనీ డిఎస్‌పి షాబాద్‌ అహమ్మద్‌, సీఐ కె రామకోటయ్య, ఎస్‌ఐ పులి రాజేష్‌, స్పెషల్‌ ఫోర్స్‌ పోలీసులు కంభం పట్టణంలో పురవీధుల గుండా పోలీస్‌ కవాతు నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై, ఎన్నికలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రైనీ డిఎస్‌పి షాబాద్‌ అహమ్మద్‌ వివరించారు.

➡️