పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలి

Dec 5,2023 21:11

  ప్రజాశక్తి-విజయనగరం కోట   :  గ్రామాల్లో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపర్చాలని వైద్యఆరోగ్యశాఖ సీనియర్‌ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాధ సూచించారు. వికసిత్‌ భారత సంకల్ప యాత్ర లో భాగంగా సీనియర్‌ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాధ మంగళవారం కొండకరకాం గ్రామంలో పర్యటించారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏమేరకు చేరుతున్నాయో తెలుసుకునేందుకు ఆమె పర్యటించారు. గ్రామంలో ఆరోగ్య సంబంధిత పథకాల అమలు తీరు పరిశీలించారు. ఇందులో భాగంగా ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌గా ఉన్న హెల్త్‌ వెల్నెస్‌ సెంటర్‌ను సందర్శించారు. ఎంఎల్‌హెచ్‌ పి, ఎఎస్‌ హెచ్‌ఎ, ఎఎన్‌ఎం లకు తగిన సూచనలు చేశారు. గ్రామంలో పారిశుధ్యాన్ని పరిశీలించి మరింత మెరుగుపర్చాలని ఎంపిడిఒకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌. భాస్కరరావు, జిల్లా ఎయిడ్స్‌, టిబి నివారణ అధికారి డాక్టర్‌ కె. .రాణి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ ఎన్‌.సూర్యనారాయణ, ఐడిఐ డాక్టర్‌ అచ్యుత కుమారి పాల్గొన్నారు.

➡️