పిఆర్‌సి వెంటనే అమలు చేయాలని నిరసన

Feb 17,2024 21:40
ఫొటో : నిరసన ధర్నా చేపడుతున్న జెఎసి నాయకులు

ఫొటో : నిరసన ధర్నా చేపడుతున్న జెఎసి నాయకులు
పిఆర్‌సి వెంటనే అమలు చేయాలని నిరసన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఎపిజెఎసి ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యయులు, కార్మిక, పెన్షనర్స్‌ ఆత్మకూరు తాలూకా తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ బకాయిలు, జిపిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ, సరేండర్‌ లీవ్స్‌, టిఎ బిల్‌, మెడికల్‌ బిల్లు, 11వ పిఆర్‌సి బకాయిలు, డిఎ బకాయిలు, 12వ పిఆర్‌సిలో ఐఆర్‌ 30శాతంను ప్రకటించాలని, అలాగే సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ ను పునరుద్ధరణ చేయాలఇ, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఎపిజెఎసి చైర్మన్‌ బి.శైలజ, ప్రధాన కార్యదర్శి బల్లి చంద్రశేఖర్‌, ఉపాధ్యక్షులు, గోవర్ధన్‌, బషీరా, ట్రెజరర్‌ సుప్రియ, ఎస్‌.సుధాకర్‌, కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ సంఘం నాయకులు సుధాకర్‌, రజని, రేష్మ, గురుప్రసాద్‌, చాణిక్యం, వెంకటేశ్వరావు, తదితరులు కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు.

➡️