పిఆర్‌ ఛాంబర్‌ రాష్ట్ర కార్యదర్శి రాజారావు హౌస్‌ అరెస్ట్‌

Feb 5,2024 21:19

ప్రజాశక్తి – నెల్లిమర్ల  : టిడిపి నాయకులు, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర కార్యదర్శి గేదెల రాజారావును పోలీసులు సోమవారం దన్నానపేటలో రాత్రి హౌస్‌ అరెస్టు చేశారు. ఈ నెల 6న సర్పంచులంతా ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా ఆయన్ను తన నివాసంలో ఎస్‌ఐ రామగణేష్‌ హౌస్‌ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గేదెల రాజారావు మాట్లాడుతూ సర్పంచుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఛలో విజయవాడకు వెళ్లకుండా ప్రభుత్వం కక్ష పూరితంగా గృహ నిర్భంధం చేయడం దారుణమన్నారు. రానున్న రోజుల్లో అధికార పార్టీకి ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.

➡️