పి ఎం పి ఆధ్వర్యంలో యల్లాప్రగడ జయంతి

యల్లాప్రగడ చిత్రపటం వద్ద నివాళులు

ప్రజాశక్తి-మండపేట

ఎన్నో రకాల దివ్యౌషధాలను ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు యల్లాప్రగడ సుబ్బారావు జయంతిని పిఎంపి అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పిఎంపి అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు కోన సత్యనారాయణ మాట్లాడుతూ జీవితమంతా దివ్యౌషధాల అన్వేషణకు పాటు పడి ప్రపంచానికి ఎన్నో ఔషధాలు అందించారన్నారు. ఆయన కషి ఫలితమే టెట్రాసైక్లిన్‌ అన్నారు. కార్యక్రమంలో పిఎంపి ప్రధాన కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, మండపూడి చంద్రశేఖర్‌, జోగ సత్యనారాయణ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

 

➡️