‘పెన్షనర్స్‌’ మహిళా దినోత్సవం

Mar 8,2024 21:53
ఫొటో : మహిళలను సన్మానిస్తున్న దృశ్యం

ఫొటో : మహిళలను సన్మానిస్తున్న దృశ్యం
‘పెన్షనర్స్‌’ మహిళా దినోత్సవం
ప్రజాశక్తి-కావలి : కావలి తాలూకా పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం పెన్షనర్స్‌ భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. 100మంది మహిళలు, పెన్షనర్స్‌ పాల్గొన్నారు. సభాధ్యక్షులుగా ఆకుల రమణయ్య, ఉపన్యాసకులుగా సి.శారద అంతర్జాతీయ మహిళా దినోత్సవ చారిత్రక ప్రాముఖ్యాన్ని వివరించారు. శ్రామిక మహిళా హక్కుల పోరాటదినం స్ఫూర్తిగా నేటికీ మహిళాదినోత్సవాన్ని జరుపుకుంటున్నా.. స్త్రీపురుష జనాభా నిష్పత్తిలో స్రీల శాతం చాలా తక్కువగా ఉండటానికి ప్రస్తుత ప్రభుత్వాల మతతత్వ పాలన, లింగవివక్ష, మృగాళ్ల దాడులు మహిళల సాధికారత, స్వావలంభనల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కులమతాలకు అతీతంగా మహిళలు సంఘటితం కావాల్సిన అవసరాన్ని స్ఫూర్తినిచ్చేలా చెబుతూ, నిర్భయ, ఆయేషా మీరా, ఆసిఫాబానో, కావలిలో తస్లీమా బానో ఉదంతాలను తెలిపారు. ప్రొఫెసర్‌ శైలజ, అంతర్జాతీయ క్రీడాకారిణి వై.కోటేశ్వరమ్మ, సి.శారద, మహిళా జర్నలిస్ట్‌ ఎస్‌.ప్రభావతి, రెడ్‌ క్రాస్‌ సేవకురాలు, పద్మావతి, గాయని ఉమాశర్మ, జమాయితే ఇస్లామి ఇ హింద్‌ కార్యకర్త షేక్‌.ఫాతిమా, జమున, ప్రియదర్శని మహిళామండలి నిర్వాహకురాలు, షేక్‌.ఖాదర్‌ బీ, తదితర వివిధరంగాల్లో సేవలందించే మహిళలను పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ఘనంగా దుశ్శాలువాలతో సత్కరించి ” పూల మొక్కలను బహుమతిగా అందజేశారు. వై.కోటేశ్వరమ్మ ‘ప్రత్యేక విందు’ను ఏర్పాటు చేశారు. చవేరా ‘గుడ్డ సంచులను’ పంచారు. రాబోయే ఏడాది నుండి మహిళలకు వివిధ పోటీలను నిర్వహించి మరింత విశిష్టంగా మహిళా దినోత్సవం జరుపుతామని అధ్యక్షులు రమణయ్య, సెక్రటరీ సాయిరాం సింగ్‌ ప్రకటించారు. ఉపాధ్యక్షులు గాయకుడు రమణయ్య, ఉమాశర్మ మహిళా దినోత్సవ స్ఫూర్తి గీతాలను ఆలపించారు.

➡️