పేదలకు ప్రభుత్వ భూములు ఇవ్వాలి

ప్రజాశక్తి -పోరుమామిళ్ల అక్కల్‌రెడ్డిపలె, ్ల కపానగర్‌ గ్రామాలలో భూమిలేని పేదలందరికీ ప్రభుత్వం భూ పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వి అన్వేష్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఉదయం అక్కల్‌రెడ్డిపల్లె, కపానగర్‌లలో భూమి లేని పేదలతో భూ పోరాటం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కల్‌రెడ్డి పల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్‌ 1583, 1584లలో ప్రభుత్వ భూములు దాదాపు 500 ఎకరాలు ఉన్నాయన్నారు. భూమిలేని పేదలందరికీ మూడు ఎకరాలు చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే కలెక్టర్‌, బద్వేల్‌ ఆర్‌డిఒకు స్థానిక తహశీల్దార్‌కు అర్జీలు సమర్పిం చామని చెప్పారు. కానీ ప్రభుత్వం రెవెన్యూ ఉన్నతాధికారులు భూ పంపిణీ చేపట్టకపోవడం భూమిలేని నిరుపేదలందరికీ నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా భూమిలేని నిరుపేదలందరికీ ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూ పంపిణీ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూములు అక్రమంగా దౌర్జన్యంగా అనర్హులు వందల ఎకరాలు సాగు చేస్తున్నా రెవెన్యూ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పది సంవత్సరాల నుంచి పేదలకు అసైన్మెంట్‌ కమిటీ ద్వారా భూ పంపిణీ చేయకుండా టిడిప,ి వైసిపి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ నాయకులు ఆరోగ్యం, రామయ్య, రాజు పాల్గొన్నారు

➡️