పేదల అభివృద్ధికి జగనన్న కృషి : మానుగుంట

Dec 18,2023 20:35
మాట్లాడుతున్న ఎంయల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి

మాట్లాడుతున్న ఎంయల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి
పేదల అభివృద్ధికి జగనన్న కృషి : మానుగుంట
ప్రజాశక్తి-కందుకూరు :పేద, ధనిక వర్గాల మధ్య అసమానతలను రూపుమాపేందుకు ఆర్థికంగా బల హీనంగా ఉన్న వర్గాలకు వివక్షత లేకుండా సంక్షేమాన్ని అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎంఎల్‌ఎ మానుగుంట మహీధరరెడ్డి తెలిపారు. కందుకూరు బిలాల్‌ నగర్‌ సచివాలయం వద్ద జరిగిన సభలో మహీధర్‌ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా ఆసరా, చేయూత, సున్నా వడ్డి,అమ్మ ఒడి, విద్యా దీవెన లాంట పథకాలను అమలు చేశారన్నారు. ఇచ్చిన హామీలను 99 శాతం సకాలంలో పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అని కొనియాడారు. మరొకసారి జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు రానున్న ఎన్నికల్లో సహకరించాలని కోరారు. జెసిఎస్‌ కో ఆర్డినేటర్‌ ముప్పవరపు కిషోర్‌ మాట్లాడుతూ జగనన్న ప్రజల ముంగిటకు పాలన తీసుకొచ్చారనాన్రు. పట్టణ అధ్యక్షుడు షేక్‌ రఫీ మాట్లాడారు. ఈకార్యక్రమానికి మున్సిపాలిటీ మేనేజర్‌ చంద్రమోహన్‌ అధ్యక్షత వహించారు. సచివాలయం పరిధిలో సంక్షేమ డిస్‌ ప్లే బోర్డును ఆవిష్కరించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. కష్ణ బలిజ కార్పోరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ పాశం కుమారి, బి సి సెల్‌ జిల్లా అధ్యక్షులు జాజుల కోటేశ్వరరావు, రాష్ట్ర యువజన కార్యదర్శి గణేషం గంగిరెడ్డి, సచివాలయం కన్వీనర్లు పాశం కొండయ్య, పల్నాటి చెన్నయ్య, భోగిశెట్టి దత్తాత్రేయ, వైసిపి పాశం పాకనాటయ్య, షేక్‌ హమీద్‌, నగళ్ళ నారయ్య, పఠాన్‌ ఆయూబ్‌ ఖాన్‌, పెయ్యల వెంకట రమణయ్య తలారి ప్రసన్న కుమారి,డి.ఆదిలక్ష్మి, షేక్‌ బికారి, షేక్‌ రహీం, షేక్‌ రిజ్వాన్‌,షేక్‌ దస్తగిరి బాషా బిరుదల సంధ్యారాణి ఉన్నారు.

➡️