పేదల బిడ్డ సిఎం జగన్‌

Jan 3,2024 21:42
ఫొటో : పింఛన్‌ను అందజేస్తున్న మేకపాటి రాజోగోపాల్‌రెడ్డి

ఫొటో : పింఛన్‌ను అందజేస్తున్న మేకపాటి రాజోగోపాల్‌రెడ్డి
పేదల బిడ్డ సిఎం జగన్‌
ప్రజాశక్తి-సీతారామపురం : పేదింటి పెద్దకొడుకు సిఎం జగన్‌ అని ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. బుధవారం సీతారామపురం మండల కేంద్రంలో జరిగిన పెన్షన్ల పెంపు, నూతన పెన్షన్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో తొలుత సిఎం జగన్‌ అవ్వాతాతలకు రాసిన లేఖను రాజగోపాల్‌ రెడ్డి చదివి వినిపించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ ఆసరా కోసం ఎదురు చూసే అవ్వాతాతలకు సిఎం జగన్‌ అండగా నిలుస్తున్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకరు చవిపోతే కానీ మరోకరికి పేన్షన్‌ ఇచ్చేవారు కాదన్నారు. మహానేత వైఎస్‌ఆర్‌ సాచురేషన్‌ పద్ధతిలో అర్హులైన వారందరి పెన్షన్లు మంజూరు చేశారన్నారు. జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సరానికి రూ.250 పెంచుతూ నేటికి రూ.3వేలు అందించి మాట నిలబెట్టుకున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే సమయంలో రాష్ట్రంలో 39లక్షల పెన్షన్లకు రూ.400 కోట్లు మాత్రమే అందించేవారని, సిఎం జగన్‌ ఇప్పుడు 66.34 లక్షల మందికి పెన్షన్లను ఇస్తున్నారని, నెలకు రూ.1900కోట్లు పెన్షన్లు రూపంలో అందిస్తున్నారన్నారు. ఏడాదికి పెన్షన్ల రూపంలో రూ.23,556 కోట్లను, అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం రూ.83,256 కోట్లు అని అన్నారు. మాజీముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ హయాంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌, ఉచిత విద్యుత్‌, 108, 104 పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. జగన్‌ పాలనలో సచివాలయం, వలంటీర్‌ వ్యవస్థలు ,అమ్మఒడి,డ్వాక్రా రుణమాఫీ, చేయూత, రైతు బరోసా తదితర పథకాలను పెట్టి నేరుగా ప్రజల ఖాతాలలో జమ చేస్తున్నారన్నారు. వందలాది రైతులకు వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులును అందించామన్నారు. మండలంలో 4వేలకు పైగా నూతన పక్కా గృహాలను మంజూరు చేయించామన్నారు. నూతన సంవత్సర సందర్భంగ పెన్షన్ల పెంపు నూతన పెన్షన్లు అందుతుండడం సంతోషంగా ఉందన్నారు. భూమిలేని పేదలకు పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఒక్క సీతారామ పురం మండలంలోనే 3439 మందికి పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం దాదాపు రూ.150 కోట్ల డిబేటి, డిబిటేతర నగదు ద్వారా సీతారామపురం మండలం అభివృద్ధి చేసిన ఘనత మన సిఎం జగనన్న దన్నారు. మండలంలోని నూతన పెన్షన్‌దారులకు పింఛన్‌ పంపిణీ చేసి అదే విధంగా పలువురు రైతులకు పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి చింతంరెడ్డి పద్మావతి, మాజీ జెడ్‌పిటిసి దుగ్గిరెడ్డి గురువారెడ్డి, రాష్ట్ర బిసి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పిసి అల్లూరు రాజు, వైసిపి మండల కన్వీనర్‌ చింతంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎంపిపి నేలటూరి అబ్రహం, వైస్‌ ఎంపిపి నేలటూరి సారమ్మ, ఇన్‌ఛార్జ్‌ ఎంపిడిఒ భార్గవి, తహశీల్దార్‌ సుధాకర్‌, పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

➡️