పేదల సంక్షేమమే థ్యేయం

ప్రజాశక్తి-చీమకుర్తి : పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి థ్యేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. మండల పరిధిలోని కెవిపాలెం,రామచంద్రాపురం,గోనుగుంట గ్రామాలలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాల భవనాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చినట్లు తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందన్నారు. తొలుత కెవిపాలెంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, బిసి కమ్యూనిటీ హాలు, బల్క్‌ మిల్క్‌ సెంటర్‌ భవనాలను ప్రారంభించారు. పొగాకు ఉత్పత్తిదారుల ఎరువుల సమైఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గోనుగుంటలో హెల్త్‌ సెంటర్‌, సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. రామచంద్రాపురంలో రైతు భరోసా కేంద్రం, సచివాలయం,బ్రిడ్జిని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ,మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, ఎంపిపి యద్దనపూడి శ్రీనివాసరావు, జడ్‌పిటిసి వేమా శ్రీనివాసరావు, వైసిపి మండల అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు కె.శేఖరరెడ్డి, జెసిఎస్‌ మండల కన్వీనర్‌ చిన్నపురెడ్డి మస్తాన్‌రెడ్డి, ఏలూరి సుబ్బారావు, ఓబులరెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు,కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

➡️