పేరుకుపోయిన బకాయిలు చెల్లించండి : యుటిఎఫ్‌

ప్రజాశక్తి-రాయచోటి/టౌన్‌ మా కోర్కెలు కాదు, న్యాయంగా ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ జాబిర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం సాయంత్రం రాయచోటిలో స్థానిక నేతాజీ సర్కిల్‌ నుండి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేశారు. డిప్యూటీ తహశీల్దార్‌ రామాంజినేయులుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జాబీర్‌ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యా యులకు రావాల్సిన ఆర్థిక బకాయిలుతక్షణమే చెల్లించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన సుమారు రూ.18 వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా పెండింగ్లో ఉంచిందని పేర్కొన్నారు. ఆగస్టులో ఉద్యోగులతో జరిగిన జాయింట్‌ స్టాప్‌ కౌన్సిల్‌ సమావేశంలో సెప్టెంబర్‌ లోపు అన్ని బకాయిలు చెల్లిస్తామని మంత్రులు, అధికారులు ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదని విమర్శించారు. బకాయిలు కోసం ఎప్పుడు ప్రాతినిధ్యం చేసినా తరువాత నెలలో ఇస్తామని చెప్పడం తప్ప ఆచరణలో ఏ విధమైన పురోగతి లేదని వారు పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలను ఇలా వాయిదాల మీద వాయిదాలు వేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం దాచుకున్న ప్రావిడెంట్‌ ఫండ్‌, ఎపిజిఎల్‌ సొమ్ముతోపాటు డిఎ, పిఆర్‌సి, ఆర్జిత సెలవుల బకాయిల చెల్లింపుల పట్లు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దావూద్‌, జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ సురేంద్రరెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్‌ శివా రెడ్డి, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యులు ప్రసాద్‌, రాయచోటి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హఫీజుల్లా, రాజా రమేష్‌, కోశాధికారి రఫీ, చిన్నమండెం మండల అధ్యక్షులు చంద్ర శేఖర్‌ రెడ్డి, సహాధ్యక్షులు కిఫాయతుల్లా, ట్రెజరర్‌ ఆదిల్‌, రెడ్డి ముని సుధాకర్‌, వీరబల్లి మండల అధ్యక్షులు నాగార్జున, మండల ప్రధాన కార్యదర్శి అమీనుల్లా, సుండుపల్లె మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శంకరయ్య,శశి కిరణ్‌ లక్కి రెడ్డి పల్లి అధ్యక్షులు రఖీబ్‌, గాలి వీడు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రియాజ్‌, ఇమ్రాన్‌, నాయకులు చాన్‌ బాషా, శ్రీనివాసులు, రెడ్డి బసయ్య పాల్గొన్నారు. మదనపల్లి : యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి పురంవెం కటరమణ, గౌరవాధ్యక్షులు సుధాకర్‌ నాయుడు, రూరల్‌ అధ్యక్షుడు గాలి రవీం ద్ర ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ డివిజన్‌ కన్వీనర్‌ భాస్కర్‌రెడ్డి, ఎగవేంటి సుధాకర్‌, ప్రధానకార్యదర్శి మల్లేశ్వరబాబు, డివిజన్‌ నాయ కులు, విజరుకుమార్‌, శైలేష్‌, అంజాద్‌, గంగులప్ప, ఆదినారాయణ, సురేంద్ర, వెంకటయ్య, ఉత్తన్న పాల్గొ న్నారు. రాజంపేట అర్బన్‌ : యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు బి.హరిప్రసాద్‌ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి బటన్‌ నొక్కి పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల కు సంబం ధించిన బకాయిల బటన్‌ కూడా నొక్కి బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శులు వెంకట సుబ్బయ్య, రమణమూర్తి, రమణయ్య, రాష్ట్ర కౌన్సిలర్‌ చెంగల్‌ రాజు, సీనియర్‌ నాయకులు నాగేశ్వర గౌడ్‌, రాజంపేట, పెనగలూరు, పుల్లంపేట, నందలూరు, ఓబులవారి పల్లి మండలాల ఉపాధ్యాయులు నాగేంద్ర, వీరయ్య, శివ కుమార్‌, వెంకట రమణ, విశ్వనాథ్‌, నరసింహారావు, మాధవ మూర్తి, రమేష్‌, హరినాథ్‌, కపా నందం, నాగూరు రవి, మంజుల వాణి, తులశమ్మ, రెడ్డెమ్మ, భాగ్యలక్ష్మి పాల్గొ న్నారు. పీలేరు : తహశీల్దారు కార్యాలయం ముందు పీలేరు డివిజన్‌ స్థాయి నాయకులు, సభ్యులు సంయుక్తంగా ధర్నా చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు ఎస్‌.శివారెడ్డి, ఆడిట్‌ కమిటీ సభ్యులు విశ్వనాథ్‌రెడ్డి, కోశా ధికారి బి.చంద్రశేఖర్‌, జిల్లా పూర్వ గౌరవ అధ్యక్షులు జి.రాధాకృష్ణ, చిత్తూరు జిల్లా కార్యదర్శి ఈశ్వర్‌ మహేంద్ర, నాయకులు సుధాకర్‌, వేణుగోపాల్‌ చెంగారెడ్డి, మస్తాన్‌, కృష్ణమూర్తి, కామేశ్వర, రెడ్డెప్ప, పుల్లయ్య, ఆదినారాయణ, అహంతుల్లా, ఆనంధరెడ్డి, శ్రీధర్‌, రాజ, వెంకటరమణ, రుద్రయ్య, సుధాకర్‌, సుబ్రహ్మణ్యం, జయరామ్‌, గోపాల్‌ రెడ్డి, రఫీ, విజయకుమార్‌, హరినాథ్‌, రెడ్డప్ప పాల్గొన్నారు.

➡️