పొదిలిలో కృష్ణ చైతన్య ప్రచారం

ప్రజాశక్తి-పొదిలి: ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబును గెలిపించాలని కోరుతూ తనయుడు కష్ణ చైతన్య బుధవారం పొదిలిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా పొదిలి అడ్డరోడ్డులోని దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి కృష్ణ చైతన్య పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రచారం ప్రారంభించారు. పొదిలి నగర పంచాయతీ పరిధిలోని 11,12 వార్డులో ఆయన ఇంటింటికీ తిరిగి తన తండ్రి అన్నా రాంబాబు, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గారిని గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్ర ఖనిజా సంస్థ డైరెక్టర్‌ కెవి రమణారెడ్డి మాజీ ఎంపీపీ జడ్పిటిసిలు కోవెలకుంట్ల నరసింహారావు సాయిరాజేశ్వరరావు, వైసీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి గొలమారి చెన్నారెడ్డి, వైసీపీ సేవాదళ్‌ జిల్లా అధ్యక్షులు గుజ్జుల సంజీవరెడ్డి, పొదిలి, కొనకనమిట్ల మండలాల పార్టీ అధ్యక్షులు దుగ్గంపూడి శ్రీనివాసరెడ్డి, మోరా శంకర్‌ రెడ్డి, ఉడుముల పిచ్చిరెడ్డి, దోర్నాల వరలక్ష్మమ్మ, యక్కలి శేషగిరిరావు, కంకణాల రమేష్‌, తాతా సత్యనారాయణ, సిసికెఆర్‌ శ్రీనివాసరెడ్డి, కల్లం సుబ్బారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️