పొర్లు దండాలు, సాష్టాంగ నమస్కారాలతో వినూత్న నిరసన

మున్సిపల్‌ కార్మికుల సమ్మె

11వ రోజుకు మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ప్రజాశక్తి -పిఎం పాలెం: మున్సిపల్‌ కార్మికుల సమ్మెపై ఉక్కుపాదం మోపుతూ, దౌర్జన్యాలు దాడులు చేయొద్దని, ఇచ్చిన హామీలే అమలు చేయాలని, జగన్మోహన్‌ రెడ్డి మనసు కరగాలని కోరుతూ శుక్రవారం 11వ రోజున మున్సిపల్‌ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. మధురవాడ జోనల్‌ కార్యాలయం పోర్లు దండాలు, సాష్టాంగ నమస్కారాలు చేసి ప్రభుత్వాన్ని వేడుకున్నారు. సిఐటియు నాయకులు సిహెచ్‌ శేషుబాబు, జోన్‌ ఉపాధ్యక్షులు డీ అప్పలరాజు, యూనియన్‌ నాయకులు బి రత్నం, ఈ జాన్‌ బి నర్సింగరావు, కే అచ్చియ్యమ్మ, బి దుర్గ, ఎస్‌ రాములమ్మ, గణేష్‌, యు రాజు పాల్గొన్నారు. టిడిపి బిసి సెల్‌ రాష్ట్ర కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు నిరసనలో పాల్గొని సంఘీభావం తెలిపారు.ములగాడ : మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా మల్కాపురం జోన్‌లో చెత్త కుప్పల ముందు బైఠాయించి కార్మికులు నిరసన చేపట్టారు. జివిఎంసి కాంటాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షులు ఆర్‌.లక్షణమూర్తి నాయకులు కె. రమణ సూరిబాబు, రాంబాబు, రాము, రైలుబాబు గొల్ల బాబు తిరుపతిరావు ఎన్‌ ఉమ, దేవి, దుర్గా పాప లలిత, లక్ష్మి, సూరమ్మ, రాజేశ్వరి క్లాబ్‌ డ్రైవర్లు కార్మికులు పాల్గొన్నారుపెందుర్తి : 94వ వార్డు వేపగుంట నుండి నాయుడుతోట వరకు మున్సిపల్‌ కార్మికులు ర్యాలీ చేశారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి యు.రాజు మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను ఐదేళ్లయినా అమలు చేయకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న సిఎం జగన్‌పైప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు పెంటరావు, చిన్న రావు పాల్గొన్నారు .గాజువాక: సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు శుక్రవారం జివిఎంసి గాజువాక జోనల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మున్సిపల్‌ కార్మికుల యూనియన్‌ గౌరవ అధ్యక్షులు ఎం.రాంబాబు,గణేష్‌ నాగరాజు, మీనాక్షి, సత్యవతి, అప్పారావు, కే కిరీటం, వై చిన్నారి పాల్గొన్నారు.మధురవాడ : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఏడవ వార్డు వాంబే కాలనీలో జగనన్న ఆరోగ్య సురక్ష, పింఛన్లపంపిణీకి వచ్చిన ఎమ్మెల్యేను కలిసేందుకు ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌, సిఐటియు నాయకులు ఆధ్వర్యంలో కార్మికులు వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. చివరకు కేవలం ఐదుగురిని మాత్రమే ఎమ్మెల్యేను కలిసేందుకు పోలీసులు అనుమతించగా, తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి హయాంలో రూ.ఆరువేలు మాత్రమే ఉన్న వేతనాన్ని , వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.18వేలకు పెంచారని, ఇంతకంటే ఎవరూ ఏం చేయలేరని ఎమ్మెల్యే ముత్తంశెట్టి వ్యాఖ్యలపై కార్మికులు నిరసన చేపట్టారు. ఆందోళనలో రాజ్‌కుమార్‌,ఎంవి ప్రసాద్‌, సిహెచ్‌ శేషుబాబు, కిరణ్‌, క్లాప్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ నాయకులు కె.సన్ని, ఎస్‌ చిన్న, బిఎ రెడ్డి పాల్గొన్నారు. నర్సీపట్నం టౌన్‌: పట్టణంలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె 11వ రోజున శుక్రవారం ఎన్టీఆర్‌ స్టేడియంలో పొర్లు దండాలు పెడుతూ నిరసన చేపట్టారు. సిఐటియు నాయకులు ఈరెల్లి చిరంజీవి శ్రీను, రాజు, ప్రసాదు, రవి పాల్గొన్నారు.విశాఖ కలెక్టరేట్‌ : సమ్మెలో ఉన్న మున్సిపల్‌ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించడం, పోటీ కార్మికులను తెచ్చి పనిచేయించడం సరైంది కాదని, ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వి.కృష్ణారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం జివిఎంసి జోన్‌ 3 కార్యాలయం వద్ద పెద్దఎత్తున జివిఎంసి కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పోలీసులనుపయోగించి కార్మికులను అరెస్టులు చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు జెఆర్‌.నాయుడు, కె.కుమారి, ఆర్‌.శ్రీను, రమణ, రాజు, వినోద్‌, బేబి, జగదీశ్వరి, విజయ, కొండమ్మ పాల్గొన్నారు. వెంకటేశ్వర థియేటర్‌ వద్ద ఉన్న జోన్‌ 4 కార్యాలయం వద్ద జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. యూనియన్‌ అధ్యక్షులు టి.నూకరాజు, సహాయ కార్యదర్శి ఎం.ఈశ్వరరావు, సిఐటియు సీనియర్‌ నాయకులు వై.రాజు తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. రూ.26 వేలు వేతనం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనకాపల్లి : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ వర్కర్లు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ సంక్రాంతి పండగ సమీపిస్తున్న తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో సిఐటియు అద్యక్షులు ఆర్‌. శంకరరావు, జి.సత్యనారాయణ, బొమ్మలు రాము, నిమ్మకాయల అజరు కుమార్‌, నూకరాజు, శివకుమార్‌, సంతోష్‌, గణేష్‌, శ్రీను, లక్ష్మణరావు పాల్గొన్నారు.

➡️