పోలింగ్‌ కేంద్రాల్లో జెసి పరిశీలన

Mar 20,2024 22:22

అధికారులతో మాట్లాడుతున్న జెసి శ్యాంప్రసాద్‌
ప్రజాశక్తి – రెంటచింతల :
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మండలంలో పలు గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలను పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శ్యామ్‌ ప్రసాద్‌ బుధవారం తనిఖీ చేశారు. కొన్ని కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌ సరఫరా, కొన్ని కేంద్రాలకు కిటికీలు సరిగా లేకపోవడంతో సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పలు పోలింగ్‌ కేంద్రాలను సిఐ ఎ.భాస్కర్‌ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజాశక్తితో ప్రత్యేకంగా మాట్లాడారు. తమ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలను ఇప్పటికే ఒకసారి పరిశీలించామని, కొన్ని సమస్యలను తమ దృష్టికి రాగా పరిష్కారానికి బిఎల్వోలకు సూచించామని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.

➡️