పోలీస్‌స్టేషన్‌ ఎదుట మృతదేహంతో రాస్తారోకో

Feb 5,2024 23:11

ప్రజాశక్తి – చేబ్రోలు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనలో న్యాయం కోసం మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. చేబ్రోలులోని పోలీస్‌స్టేషన్‌ ఎదుట రహదారిపై సోమవారం ధర్నా చేశారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరుకు చెందిన చల్లపల్లి విజరు (24) ద్విచక్ర వాహనంపై ఆదివారం వస్తుండగా చేబ్రోలులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సమీపంలో కారు ఢకొీట్టింది. కిందపడిన విజరు పైనుండి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ఘటనలో తమకు న్యాయం జరగలేదని మృతుని కుటుంబీకులు, బంధువులు విజరు మృతదేహంతో ధర్నాకు దిగారు. ఈ క్రమంలో పోలీసులతో తీవ్ర వాగ్వాదమైంది. పొన్నూరు రూరల్‌, పట్టణ సిఐలు కోటేశ్వరరావు, భాస్కర్‌, ఎస్‌ఐ గిరిబాబు, తహశీల్దార్‌ కెవి గోపాలకృష్ణ అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడారు. అధికారులుగా తాము చేయగలిగినంత వరకూ చేస్తామని సర్దిచెప్పడంతో ఆందోళనను విరమించారు.

➡️