పౌరుషానికి ప్రతీక బొబ్బిలి యుద్ధం

Jan 24,2024 21:33

ప్రజాశక్తి- బొబ్బిలి: పౌరుషానికి ప్రతీకగా బొబ్బిలి యుద్ధం నిలుస్తుందని టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి బేబినాయన అన్నారు. బొబ్బిలి యుద్ధం దినోత్సవం సందర్భంగా బుధవారం యుద్ధ స్తంభం వద్ద యుద్ధంలో ప్రాణ త్యాగం చేసిన వీర సైనికులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొబ్బిలి యుద్ధంలో తాండ్రపాపరాయుడు, సైనికులు వీరోచితంగా పోరాడి ప్రాణాలను త్యాగం చేశారన్నారు. బొబ్బిలి యుద్ధంలో వీర సైనికులు త్యాగంతో బొబ్బిలి పౌరుషంగా గుర్తింపు వచ్చిందన్నారు. బొబ్బిలి యుద్ధాన్ని నేటి తరానికి తెలియజేసేందుకు సినిమాలు, బుర్రకథలు, నాటికలు రూపంలో కళాకారులు సజీవం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్వతీపురం టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి బి.విజయచంద్ర, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

➡️