పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం : సిడిపిఒ

Mar 13,2024 21:51

ప్రజాశక్తి – పాచిపెంట: పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని సిడిపిఒ బి.అనంతలక్ష్మి అన్నారు. పోషకాహార పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలతో పోషణ పక్వాడ కార్యక్రమంపై ర్యాలీ, మానవహారం ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ 15 రోజులు ప్రతి అంగనవాడీ కేంద్రం వద్ద ప్రతిరోజు గర్భిణీలకు, బాలింతలకు, కిశోర బాలికలకు, పిల్లలకు పోషకాహార ప్రాముఖ్యత గురించి తెలియజేయాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. అలాగే పిల్లల్లో మేధాశక్తి, చురుకుదనం పెంపొందించేలా ఆటపాటలతో కూడిన విద్య, ఆహారపు అలవాట్లు పెంపొందించేలా కృషి చేయాలన్నారు. అనంతరం ఓటు హక్కు ఆవశ్యకత గురించి అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. నీ ఓటు నీ భవిష్యత్తు.. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని పోలింగ్‌ శాతం పెంచాలని తదితర అంశాలపై నోడల్‌ ఆఫీసర్‌ రాజశేఖర్‌ రెడ్డి కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.కురుపాం : పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా కురుపాం-3 అంగన్వాడీ సెంటర్‌ వద్ద పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల పౌష్టికాహారం ఆవశ్యకత కేంద్రాల్లో అందిస్తున్న సేవలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎఎన్‌ఎంలు డి.పద్మ, నిర్మల, అంగన్వాడీ కార్యకర్తలు జె.సరోజ, ఎస్‌.వసంతరాణి, పి.సరస్వతి, ఎస్‌.శోభారాణి, సూర్యకుమారి, రాధాకుమారి, అమ్మాజీ , లక్ష్మి, సత్యవతి పాల్గొన్నారు.

➡️