ప్రజలే ప్రచార సారధులు : ‘ఆకేపాటి’

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ వైసిపి ప్రభుత్వంలో వివిధ సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్లని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. గురువారం నూనెవారిపల్లిలోని ఆకేపాటి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఈ ఐదేల్లలో వంద శాతం అమలు చేశారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో నవరత్నాలు పథకాలు అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అభివద్ధి లేదని ప్రతిపక్షం నోరుపారేసు కుంటోందని, నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివద్ధి, ఆరోగ్య సురక్ష ద్వారా వైద్య విధానంలో అభివద్ధి, ఆరోగ్యశ్రీ రూ.25 లక్షలకు పెంపు, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటిలోనూ వెలుగులు నింపారని, ఇది అభివద్ధి కాదా అని సూటిగా ప్రశ్నించారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనా ర్టీలపై సిఎంకు ఎనలేని మమకారం ఉందని తెలిపారు. ఆ మమకారంతోనే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిత్యం పరితపిస్తుంటారన్నారు. ఎల్లో మీడియా పనికట్టుకొని వైసిపి ప్రభుత్వంపై విషప్రచారం చేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు తన అధికారంలో ఏ ఒక్క సంక్షేమం తీసుకొచ్చి రాష్ట్రానికి ఏం చేశారని ఎన్నికలలో ప్రజల వెళతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివద్ధి, సంక్షేమం కొనసాగాలంటే తిరిగి జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. వైసిపి రాజంపేట నియోజకవర్గం అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తనతోపాటు పార్లమెంటు అభ్యర్థి మిథున్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, తిరిగి రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చేందుకు కషి చేయాలని తెలిపారు. శుక్రవారం నుంచి ప్రచారం ప్రారంభిస్తానని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులురెడ్డి, విశ్వనాథరెడ్డి, ఈశ్వరయ్య, పథ్వీపతిరెడ్డి, శామీర్‌ భాష పాల్గొన్నారు.

➡️