ప్రజల చెంతకు ప్రభుత్వ సేవలు

Mar 15,2024 20:51

ప్రజాశక్తి-గుర్ల : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పరిపాలనలో తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువయ్యాయని జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. గుర్ల మండలంలో కొండగండ్రేడులో సచివాలయం, రైతు భరోసా భవనాలను శుక్రవారం ప్రారంభించారు. లోదమరసింగి గ్రామానికి రూ.1.8 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు గ్రామాల్లోనే లభిస్తున్నాయని తెలిపారు. సచివాలయాల ద్వారా అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించామన్నారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా నాయకులు పొట్నూరు సన్యాసినాయుడు, కె.వి. సూర్యనారాయణరాజు, జెడ్‌పిటిసి అప్పలనాయుడు, జెసిఎస్‌ మండల కన్వీనర్లు బంగారునాయుడు, మధుసూదన్‌రావు, వైసిపి మండల అధ్యక్షులు జమ్ము స్వామినాయుడు, సర్పంచ్‌ సారిక గోవింద, ఎంపిటిసి మణిపూరి రామారావు, ముద్దాడపేట సర్పంచ్‌ సురేష్‌, ఎంపిడిఒ వెంకటరమణ పాల్గొన్నారు.

గరివిడి : గరివిడిలోని వైసిపి కార్యాలయంలో శుక్రవారం మేము సిద్ధం – మా బూత్‌ సిద్ధం కార్యక్రమంలో భాగంగా మెరకముడిదాం మండలంలో వాలంటీర్లు, బూత్‌ కన్వీనర్లు, సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా అందించిన ఘనత సిఎం జగన్‌కు దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. చంద్రబాబు నాయుడు గ్యారెంటీల పేరిట అమలు చేయలేని హామీలిచ్చి ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. సమావేశంలో వైసిపి నాయకులు బొత్స సందీప్‌, తాడ్డి వేణు, ఎస్‌వి రమణరాజు, జెడ్‌పిటిసి కోట్ల వెంకటరావు, జెసిఎస్‌ కన్వీనర్‌ కె.రాము, వైస్‌ ఎంపిపి తలచుట్ల హరిబాబు, బుర్ల నరేష్‌ పాల్గొన్నారు.

➡️