ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి : ఇఆర్‌ఒ

ప్రజాశక్తి-కొండపి : దేశ పౌరుడిగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం అందరి బాధ్యత అని ఎన్నికల రిటర్నింగ్‌ అదికారి ఎ.కుమార్‌ తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నుంచి గాందీబొమ్మ సెంటర్‌, జెండా చెట్టు సెంటర్‌, ఎన్‌టిఆర్‌ కూడలి వరకూ ఓటరుకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఆర్‌ఒ కుమార్‌ మాట్లాడుతూ ఓటర్లు డబ్బు,ఇతర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్చగా ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు కిరణ్‌కుమార్‌, ఎంపిడిఒ నాగమణి, పంచాయతీ డిఇ రవిబాబు, వివిధ శాఖల అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.

➡️