ప్రత్యర్థి ఎవరైనా విజయం నాదే

Mar 16,2024 21:04

ప్రజాశక్తి- బొబ్బిలి: విజయ నగరం పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రత్యర్థి ఎవరైనా విజయం తనదేనని వైసిపి ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. బొబ్బిలిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గం బిసిలు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గమని, రానున్న ఎన్నికల్లో తనపై ఎవరు పోటీ చేసినా బిసి సామాజిక వర్గానికి చెందిన తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ఓటర్లు అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేస్తారన్నారు.

➡️