ప్రశాంత ఎన్నికల నిర్వహణకు చర్యలు

Mar 5,2024 21:34

ప్రజాశక్తి – సీతంపేట : నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి అన్నారు. మంగళవారం పాలకొండ డిఎస్పీ, సిఐ, ఎస్‌ఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ముందస్తు బైండోవర్‌ కేసులు నమోదు చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ప్రత్యేక కవాతు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డిఎస్‌పి కృష్ణారావు, సిఐ చంద్రమౌళి, ఎస్‌ఐలు జగదీష్‌నాయుడు, అనిల్‌కుమార్‌, తహశీల్దార్లు మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.రాజకీయ పార్టీలతో సమావేశం ఓటర్ల జాబితాకు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలపై విచారణ చేపట్టి తప్పులను సరిదిద్దామని పిఒ తెలిపారు. ఇంకా ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. పోలింగ్‌ సమయానికి అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకొంటామన్నారు. కార్యక్రమంలో అన్ని పార్టీల రాజకీయ ప్రతినిధులు పాల్గొన్నారు.క్రీడా పరికరాలు అందజేత జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ప్రతిభ కనబర్చిన ఉత్తమ క్రీడాకారులకు పిఒ కల్పనకుమారి క్రీడా పరికరాలను అందజేశారు. హాకీ, వాలీబాల్‌, ఆర్చరీ క్రీడాకారులు 20 మందిరి వీటిని అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ క్రీడాపరికరాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. క్రీడా పరికరాలను గ్రీన్‌ ఫీల్డ్‌ స్టేడియంలో భద్రపరిచి క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని స్పోర్ట్స్‌ ఇంచార్జ్‌కు సూచించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్‌ ఇంచార్జ్‌ జాకబ్‌దయానంద్‌ తదితరులు పాల్గొన్నారు

➡️