ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు

Jan 12,2024 22:17
ఫొటో : కేక్‌ కట్‌చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

ఫొటో : కేక్‌ కట్‌చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు
ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు
ప్రజాశక్తి-ఉదయగిరి : స్థానిక తహశీల్దారు కార్యాలయం ఆవరణంలో నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రియాంక గాంధీ 52వ జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి దుద్దుకూరు రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్‌ నాయుడు మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతంకు ప్రియాంక గాంధీ పనిచేస్తుందన్నారు. రానున్న సావిత్రి ఎన్నికల్లో కర్ణాటక తెలంగాణ లాగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధిస్తుందన్నారు. రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని జోస్యం పలికారు. కాంగ్రెస్‌ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసమే స్థాపించబదిందన్నారు. ఇప్పటికే అన్ని వర్గాల నాయకులు కాంగ్రెస్‌ పార్టీకి మొగ్గు చూపుతున్నారు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించకపోతే దేశ ప్రజలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బిడ్డ షర్మిలమ్మ కాంగ్రెస్‌లో చేరడంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలోపేతమైందన్నారు. మొదటిగా భారీ కేకును కట్‌ చేసి కార్యకర్తలకు, అభిమానులకు పంచి పెట్టారు. కార్యక్రమంలో సీతారామపురం మండల అధ్యక్షులు హజరత్‌ మాజీ ఎంపిపి సత్తెనపల్లి బాలయ్య, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️