ఫుట్‌ బాల్‌ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేత

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం

ఇటీవల రాష్ట్రస్థాయి పుట్‌బాల్‌ పోటీలలో పాల్గొన్న తాడువాయి హైస్కూల్‌ విద్యార్థులకు దాతలు క్రీడా దుస్తులు అందజేశారు. శుక్రవారం తాడువాయి ప్రభుత్వ హైస్కూల్‌ క్రీడాకారులు టి.శంకర శ్రీనివాస్‌ గుప్తా, యరమళ్ల జాన్‌లకు పాపోలు సుబ్బారావు జ్ఞాపకార్థం వారి భార్య ఈశ్వరమ్మ కుమారులు రామ్మోహనరావు, రామాంజనేయులు, కుటుంబ సభ్యులు క్రీడాకారులకు రెండు జతల టీషర్ట్స్‌, షూస్‌, ఫుట్‌ బాల్స్‌ బహూకరించారు. మంచి ప్రతిభ కనబరిచి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని దాతలు విద్యార్థులను అభినందించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయిని విఎల్‌.నర్సమాంబ మాట్లాడుతూ గ్రామస్తులు, దాతల సహకారంతో విద్యార్థులను బాగా తీర్చిదిద్ది వారికి ఆటలలో మంచి నైపుణ్యం వచ్చేలాగా తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పీడీ విజయశాంతి, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️