బంకు దగ్ధం

Dec 17,2023 18:02
దగ్ధమైన బంకు దృశ్యం

దగ్ధమైన బంకు దృశ్యం
బంకు దగ్ధం
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్ర మాదంలో ఓ బంకు పూర్తిగా మంటలకు ఆహుతయింది. దాంతో ఓ వంటరి మహిళ జీ వనాధారాన్ని కోల్పోయి వీధిన పడింది. ఈ అగ్నిప్ర మాదంపై బాధితురాలు అను మానం వ్యక్తం చేస్తుండడం గ మనార్హం ఈ ఘటనపై పోలీసు లకు అందిన ఫిర్యాదు మేరకు వివరాలిలా వున్నాయి. తోటప ల్లి గూడూరు మండలం ఇస్క పాలెం దళితవాడకు చెందిన ఒంటరి మహిళ వాణి బంకు పెట్టు కొని కొడుకొని పోషిస్తూ జీవ నం సాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి బం కు మూసి ఇంటికి వెళ్ళింది. అయితే అర్ధరాత్రి బంకుకు మంటల అంటుకొని బంకుతో పాటు అందులోవున్న వస్తు సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. కేవలం స్థలం వివాదంతోనే ఉద్దేశ్య పూర్వకంగా తన బం ధువులే బంకుకు నిప్పం టిం చారని బాధితురాలు పోలీసు లకు ఇచ్చిన ఫిర్యాదులో పే ర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️