బహిరంగ ధూమపానం నిషేధం : ఎస్‌పి

Feb 2,2024 21:11

ప్రజాశక్తి-విజయనగరం కోట  :   రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సిగరెట్లు , ఇతర పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం అమలుపై పోలీసు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించేందుకు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఒక్కరోజు శిక్షణ ఏర్పాటు చేశారు. సంబంధ హెల్త్‌ ఫౌండేషన్‌ (ఎన్‌జిఒ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్‌పి ఎం.దీపిక మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం, ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకు ఉత్పత్తులను వినియోగాన్ని ప్రభుత్వం నిషేదించినప్పటికి వాటిని నియంత్రించుటలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా మన్నారు. ఇకపై కాప్టా చట్టాన్ని అమలు చేసి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసే వారిపైనా, స్కూల్స్‌/కాలేజ్‌కి వంద అడుగుల విస్తీర్ణంలో పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా పోరాడుతామని, కాప్టా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్లును ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశాఖ మెడికవర్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ చీఫ్‌ సర్జికల్‌ అంకాలజిస్ట్‌ కార్తీక్‌ చంద్ర పల్లం, డిఎంహెచ్‌ఒ ఎస్‌.భాస్కరరావు, సంబంద్‌ హెల్త్‌ ఫౌండేషను ప్రాజెక్టు అధికారి ప్రమోద్‌ కుమార్‌ మాట్లాడారు.

➡️