బహిరంగ సభకు తరలివెళ్లిన కాంగ్రెస్‌ శ్రేణులు

బహిరంగ సభకు తరలివెళ్లిన కాంగ్రెస్‌ శ్రేణులు

ప్రజాశక్తి-అనకాపల్లి

‘విశాఖ ఉక్కు-తెలుగోడి హక్కు’ పేరుతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో శనివారం జరిగిన కాంగ్రెస్‌ బహిరంగ సభకు ఎపిసిసి అధికార ప్రతినిధి ఐఆర్‌.గంగాధర్‌ నాయకత్వంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ శ్రేణులు తరలివెళ్ళారు. ఈ సందర్భంగా గంగాధర్‌ మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ని కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు దాసరి సంతోష్‌, అనకాపల్లి మండల అధ్యక్షులు కట్టుమూరి నూక అప్పారావు, కశింకోట మండల అధ్యక్షుడు సనేడ గజ్జాలు, జిల్లా కార్యదర్శి ఎగ్గాడ భాస్కరరావు పాల్గొన్నారు.

➡️